Saturday, April 4, 2009

ఒంటరి

ఎర్రగా ఎదుగుచున్న,
చతుర్ధశి చంద్రుని చాయలకి,
అప్పటికే ఆవరించిన అంధకారం అంతరిస్తుండగా...

ఆగని అలలతో,
సింధూరం అయింది సముద్రం ఎదురుగా.
ముద్దగా ముంచుకొస్తున్న మంచుకి,
కుప్ప కూలినవి కోనలు వెనుకగా!!

చక్కని చుక్కలు,
నిత్యం మేమే నీ తోడనుచూ..,
నిలిచాయి నింగికి నేలకి మద్యగా!!

ఎప్పటిలానే,
ఈ ఒంటరి తనువు తుంటరి అయ్యను,
ఆ ఊహల సుందరి ఊరిస్తుండగా..
నా వెచ్చని ఊపిరి వేదిస్తున్నది,
నీ స్వప్న సుందరిని చెరుకొమ్మని!?

ఇంతలొ,
చటుక్కున తగిలిన పిల్ల గాలికి,
వెనుతిరిగి చూచాను.ఓ నల్లని రూపం.
నా నీడే..నీ వెంటవున్నది నేనే నంటూ...

మళ్లీ శూన్యం వైపుకి చూపులు,
ఆపై మైకం కమ్ముకొస్తోంది.
అల్లంత దూరన, ఆ దేవకన్యే!?
సైగ చేస్తోంది నను చేరమ్మంటూ...
చేతుల్ని చాచా ఇక వదలనంటూ!!

అంతలొ,
చిటపట చినుకులు,
కళ్లు తెరిచి చూచాను,
ఆకాశం అంతా మబ్బు,
వెన్నెల లేదు,
హెచరిస్తోంది ఆ జడి వాన.

పరుగు తీయాలనుకున్నా.,
కూరుకపొయాయి నా కాళ్లు ఇసుకలో!!
అంతే కుప్ప కూలిపోయాను.
ఈ స్థితి ఎప్పటినుండో...
ఇంకా ఎంతవరకో!!!

Sunday, December 30, 2007

చెలి

సవ్వడి చేసిన చిరుగాలుల్లో,
రివ్వున ఎగిరే నా మనసు చిలుకయై,
గమ్యం ఎరుగక...

మహారాణివే నీవైతే,
పల్లకి నేనై చేరెదను.
ధరణికి దీఫ్తివై నీవుంటే,
నింగిని నేనై కలిసెదను. ఈ-
సంగతి తెలియద ఓ చెలియా..
నిత్యం వ్యదతో నేవున్నా!!

దశ దిశల్లోనూ, ఎటు చూచినా,
పరువాల నీ రూపు పులకించి, నా-
మదిలో కొలువై వున్నావే.

గలగల పారె సెలయేరా,
రివ్వున వీచే చిరుగాలి, నా-
సఖికి తెలుపరా ఈ వ్యదని.

Saturday, December 29, 2007

తను

వింతల్ని చూపుతుంది,
వసంతమై తను వస్తూ...

మనస్సు దోచుకుంటుంది,
వెన్నెట్లో తను వుంటూ...

తనువు తుంటరవుతుంది,
తడుస్తూ తను చిందులేయగా...

ఒళ్లు ఝల్లు మంటుంది,
తను ఎత్తు, లోతుల్ని చూపితే!!!

హాయి కలుగుతోంది,
తను కూని రాగాలు తీయగా...

తనలొ ఎన్ని వున్ననూ,
పిలుస్తోంది తను ఒంటరినంటూ...

ఎదురు చూపు ఏల,ఏకమైపోక,
ఆ కమనీయ ప్రకృతితో.